కోమటిరెడ్డిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి: జెడ్పీ వైస్ చైర్మన్ బిక్కు నాయక్ డిమాండ్

  • సందీప్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు సరికాదన్న బిక్కు నాయక్
  • బాధ్యత గల హోదాలో ఉన్న మంత్రి ఇష్టానుసారంగా మాట్లాడారని ఆగ్రహం
  • రైతులను, ప్రజాప్రతినిధులను చులకనగా చూస్తున్నారని విమర్శ 
జెడ్పీ చైర్ పర్సన్ సందీప్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని... అలా మాట్లాడటం దురదృష్టకరమని యాదాద్రి భువనగిరి జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ బిక్కు నాయక్ మండిపడ్డారు. బాధ్యతగల హోదాలో ఉన్న మంత్రి ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదన్నారు. ఆయనను వెంటనే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. భువనగిరిలో జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీటీసీలతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కోమటిరెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇష్టారీతిన మాట్లాడే మంత్రిని వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా గడవకముందే రౌడీల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రైతులను, ప్రజాప్రతినిధులను చులకనగా చూస్తున్నారని ఆరోపించారు. మంత్రి కోమటిరెడ్డి ఇలాగే వ్యవహరిస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కోమటిరెడ్డి నిరంకుశ వైఖరిపై తెలంగాణవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతాయన్నారు.

Komatireddy Venkat Reddy
Congress
BRS

More Telugu News